టీపీసీసీ ప్రకటనపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

by Anukaran |   ( Updated:2021-06-26 11:46:04.0  )
టీపీసీసీ ప్రకటనపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా ఐదుగురిని, పది మందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించింది. దీనిపై ఎంపీ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనపై నమ్మకంతో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం చాలా గౌరవంగా ఉందని అభిప్రాయపడ్డారు. తన ఎంపికకు సహరించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జాతీయ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణలో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని రేవంత్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాల కోసం, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సీనియర్లు అందరినీ కలుస్తామని, అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయని, కుటుంబం అన్నప్పుడు రకరకాల సమస్యలుండటం సహజమని ఆయన ఆభిప్రాయపడ్డారు. అందరం కలిసి కొట్లాడుతామని, అందరినీ కలుపుకుని పోతానని ఆయన అన్నారు.

Advertisement

Next Story