- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దానికి మామా అల్లుళ్లు పోటీ పడుతున్నారు : ఎంపీ
దిశ ప్రతినిధి, మెదక్: సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివనూర్‌లో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు నాడు యూత్ కాంగ్రెస్‌లో స్థానం కల్పించి రాజకీయంగా అవకాశం కల్పించింది. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ వల్లే 2004లో హరీశ్ రావు మంత్రి అయ్యాడు. తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ.. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టేందుకు మామా అల్లుళ్ళు పోటీ పడుతున్నారు. దుబ్బాకకు వచ్చిన అభివృద్ధి పథకాలన్నీ సిద్దిపేటకు తరలించుకుపోయారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవం కోసం జరిగిన ఉద్యమం. అలాంటిది దుబ్బాకపై సిద్దిపేట నాయకుల పెత్తనం ఏంటి? నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. రైతులకు గిట్టుబాటు బాట ధరలు కూడా రాలేదు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడిస్తేనే కేసీఆర్‌కు కనువిప్పు కలుగుతుంది. హామీలు నెరవేరాలంటే టీఆర్ఎస్‌ను ఓడించాలి’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.