- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన ఎంపీ రఘురామ
దిశ, ఏపీ బ్యూరో: రైతుల సుదీర్ఘ పోరాటం ద్వారానే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు సాధించిన గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసిన రైతులు, వారికి సహకరించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయంపై మళ్లీ వెనక్కి వెళ్లకుండా రాజధానులు మూడు కాదు రెండు అని ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వం ప్రకటించిన రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అమరావతికి బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిన తరుణంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరో రకంగా కుట్రలు చేయొచ్చని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు.