మహాపాదయాత్ర విజయవంతం కావాలి: ఎంపీ రఘురామ

by srinivas |
raghurama
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి పరిరక్షణకు రైతులు శాంతియుతంగా మహా పాదయాత్ర నిర్వహిస్తుంటే ఆంక్షల పేరుతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. రైతుల మహా పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీలో సోమవారం ఎంపీ రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మహా పాదయాత్రకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

పాదయాత్రలో పాల్గొనలేని వారు సోషల్ మీడియా, ఇతర పద్ధతుల ద్వారా మద్దతు తెలపాలని కోరారు. గతంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్రకు కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నా అక్కడ ఎవరు అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story