మంత్రి కొడాలి నాని బెదిరిస్తున్నారు

దిశ, వెబ్‌‌డెస్క్: అమరావతి నుంచి శాసనసభ రాజధానిని కూడా తరలించాలని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ప్రభుత్వ వైఖరిని కొడాలిని నాని ప్రకటించి, రాజధానిని పూర్తి స్థాయిలో తరలించాలన్న ఉద్దేశ్యాన్ని బయట పెట్టారని పేర్కొన్నారు. కోర్టులో కేసులు ఉపసంహరించుకోకుంటే ఈ చిన్న రాజధానిని కూడా తరలిస్తామని మంత్రి కొడాలి నాని బెదిరిస్తున్నారన్నారు. ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని శ్రీకాకుళంలో కాకుండా కడపలో ప్రారంభిస్తే ప్రజల స్పందన తెలుస్తుందని, రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అక్షరాస్యతలో ఏపీ చివరి స్థానంలో నిలవడం విచారకరమన్నారు.

Advertisement