- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు ఎంపీ పోతుగంటి వినతి.. ఎందుకో తెలుసా?
దిశ, అచ్చంపేట: జిల్లాలోని డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా వంగూరు, చారగొండ గ్రామాల రైతులకు నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంపీ పోతుగంటి రాములు వినతిపత్రం అందజేశారు. ఆదివారం ఎంపీ ‘దిశ’ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ… చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న 300 ఎకరాలకు పైగా సుమారు రూ.28 కోట్ల నిధులు మంజూరు చేయడం ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. అలాగే డిండి కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా సేకరించిన భూమికి పరిహారం అందక, రైతుబంధు రాక, సాగు కష్టంగా మారిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం స్వీకరించిన సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని త్వరలోనే రైతులకు నష్టపరిహారం అందించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారని ఎంపీ వివరించారు