- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం కొనేదాకా ఊరుకోం.. కేంద్రానికి టీఆర్‌ఎస్ ఎంపీ వార్నింగ్
దిశ ప్రతినిధి, ఖమ్మం: ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై ఢిల్లీలో పోరాటం కొనసాగిస్తామని టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం దేశ రాజధానిలో తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరుగురు మంత్రులతో, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, సహచర ఎంపీలు ఢిల్లీలో మంత్రుల అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇప్పటివరకు తమకు స్పష్టత లేదని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుల విషయంలో పార్లమెంట్ ఇంటా, బయటా టీఆర్ఎస్ ఎంపీలందరం చిత్తశుద్ధితో పోరాడామని, భవిష్యత్తులో కూడా పోరాడుతామని వెల్లడించారు. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన పట్ల కేంద్రం, బీజేపీ ఎంపీలు అమానుషంగా, అమర్యాదకరంగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దానికి తోడు పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం మంత్రులతో అబద్ధాలు చెప్పించిందని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన మేరకు ధాన్యం సేకరణ దాదాపు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిపోయిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వచ్చామని, ఈ విషయంపై మరోసారి స్పష్టత కోరనున్నామన్నారు. గతంలో అంతా కొంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే తమకు స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేస్తున్నట్టు ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వివరించారు.
- Tags
- central