NHAI అధికారికి లేఖ రాసిన కోమటిరెడ్డి.. విషయం ఏంటంటే.?

by Shyam |   ( Updated:2021-08-06 04:02:05.0  )
Komati-reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : రెండు జాతీయ ర‌హ‌దారులు క‌లిసే వంగ‌పల్లి వ‌ద్ద వెహిక‌ల్ అండ‌ర్ పాస్ నిర్మించాల‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కోరారు. నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, కేంద్ర రోడ్డు ర‌వాణా జాతీయ ర‌హ‌దారుల శాఖ సెక్రట‌రీ గిరిధ‌ర్ ఆర్మనేను న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. జాతీయ ర‌హ‌దారి 163, 65 లు వంగ‌ప‌ల్లి మీదుగా వెళ్తాయని.. ఎన్‌హెచ్ఏఐ ఈ ప్రాంతాన్ని జంక్షన్‌గా అభివృద్ది చేయ‌డానికి గతంలో ప్రణాళిక‌లు రూపొందించింద‌ని తెలిపారు. ఇక్కడ అండ‌ర్ పాస్ బ్రిడ్జీ కావాల‌ని చాలాకాలంగా స్థానికులు కోరుతున్నార‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో అండ‌ర్ పాస్ బ్రిడ్జీ నిర్మిస్తే ర‌వాణాకు ఇబ్బందులు తప్పడంతో పాటు ఎన్నో ప్రమాదాల‌ను నివారించ‌వ‌చ్చని తెలిపారు. అలాగే చౌటుప్పల్, టేకుమట్ల వ‌ద్ద వీయూపీ నిర్మించాల‌ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ గిరిధ‌ర్ వెంట‌నే చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

Next Story