- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంతోషం కొందరిలోనే.. అందరిలో లేదు
దిశ, నల్లగొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కొందరిలోనే సంతోషం ఉందని, అందరిలో లేదని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పీఏసీఎస్ బ్యాంకు ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రైతులకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గానికి నీరందిస్తానని సీఎం కేసీఆర్ హామీచ్చి.. మాట తప్పారని అన్నారు. గుండాల మండలానికి వచ్చే నీటిని అక్రమంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు తన నియోజకవర్గానికి తరలిస్తున్నారని ఆరోపించారు. ఎర్రబెల్లి మంత్రికావడం మన దురదృష్టమని, ఆయన్ను ఎన్నిసార్లు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మోదీ ప్రవేశపెట్టిన రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో రైతులకు ఒరిగిందేమీ లేదని ఎంపీ అభిప్రాయపడ్డారు. గంధమల్ల రిజర్వాయర్ రద్దయ్యిందని అధికారులు తనతో చెప్పారని కోమటిరెడ్డి అన్నారు. బస్వాపూర్ ద్వారా గుండాల మండలానికి నీళ్లు రావని, వచ్చే ఏడాది జూన్ 6 వరకు ఆలేరు నియోజకవర్గానికి బస్వాపూర్ ద్వారా నీరు వస్తే కేసీఆర్‌కు పార్టీలకతీతంగా పాలాభిషేకం చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.