- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైతుల కష్టాలు చూస్తే.. కన్నీరు ఆగట్లేదు : కోమటిరెడ్డి
దిశ, భువనగిరి: ధాన్యం కొనుగోలుకు వచ్చిన రైతులను పట్టించుకునే నాథుడే లేడని, ప్రతిపక్ష నేతల కొనుగోలపై ఉన్న శ్రద్ధ రైతుల ధాన్యం కొనుగోలుపై లేదని కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డుపై రైతన్నలు పడుతున్న పడుతున్న కష్టాలు చూస్తుంటే కన్నీరు వస్తోందని అన్నారు. తన 30ఏళ్ల రాజకీయ చరిత్రలో ధాన్యం కొనుగోలులో ఇలా ఏ ప్రభుత్వం ఆలసత్వం చూపించలేదని తెలిపారు. అసలు రాష్ట్రంలో రైతుల గోసను పట్టించుకునే ప్రభుత్వ పెద్దలు లేరన్నారు. ఏ పార్టీ నుంచి ఏ నేతను కొనుక్కోవాలనే తప్పా, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులపై శ్రద్ధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై శ్రద్ద పెట్టాల్సిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్‌లో ఈటల వర్గీయులను కొనటంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై మొదట తీవ్రంగా ఖండించిన కేసీఆర్, కేంద్రం మెడలు వంచి చట్టాలు రద్దు చేయిస్తానని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినట్టు గుర్తుచేశారు. పైగా ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదని అన్నట్టు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల కాలంలో ధాన్యం కొనుగోలు వల్ల రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని మాట్లాడడం కేసీఆర్‌కు వ్యవసాయం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో బయటపడిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి 11 లక్షల కోట్ల ఖర్చు పెట్టిన అని చెప్పుకునే కేసీఆర్ మూసీనది శుద్ధికి రూ. 3 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయట్లేదని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పండిన పంటను కొనుగోలు చేయకూడదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యకం చేశారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.