- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నామీద కోపంతోనే సీఎం పెండింగ్‌లో పెట్టారు’
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనమీద కోపంతోనే బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పనులు పెండింగులో పెట్టారని ఆరోపించారు. తమ పన్నులతో సిద్ధపేటను అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్.. తెలంగాణకు ముఖ్యమంత్రా? సిద్ధిపేటకా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు ఇవ్వకుండా సర్పంచ్‌లను అవమానించారని, అభివృద్ధి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనను ఎండగట్టడానికి మార్చి నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్టు ప్రకటించారు. బీజేపీ వాళ్లు జైలుకు పంపుతారన్న భయంతో ఢిల్లీకి వెళ్లి వ్యవసాయ చట్టాలకు జై కొట్టారని విమర్శించారు. గ్రామాల్లో ఐకేపీ కొనుగోళ్లు రద్దు చేస్తే మంత్రులను, ఎమ్మెల్యే లను గ్రామాలలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.