- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు దానిపై ఉన్న శ్రద్ధ దేనిపైనా లేదు: కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: కొడుకును సీఎం చేయాలని ఉన్న శ్రద్ధ.. కేసీఆర్‌కు ప్రజా సంక్షేమంపై లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భారతీయ రాజకీయ వ్యవస్థలోనే ఆయనను మించిన మోసగాడు మరెవరు లేరని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఈద్గాలో ఉర్సు ఉత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉద్యోగులను, నిరుద్యోగులను కేసీఆర్ అవమానించారని.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పీఆర్సీ విషయంలో తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కొడుకు కోసం సెక్రటేరియట్ కడుతున్న సీఎం.. ప్రజల కోసం ఉస్మానియా ఆస్పత్రిని ఎందుకు పునురుద్ధరించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సింది ఏమి లేదని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ఎంపీ కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.