- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలా మోస్తారు… ?: ఎంపీ కోమటిరెడ్డి
దిశ, నల్లగొండ: అధిక విద్యుత్ బిల్లులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం చలో సెక్రటేరియట్‌ను చేపట్టింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోమటిరెడ్డిని ఉదయం 6 గంటలకే పోలీసులు ఆయన నివాసంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తున్నారని, కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించి అద్దె కూడా చెల్లించొద్దని చెప్పారని గుర్తు చేశారు. కానీ, నేడు స్లాబుల పేరుతో అధిక విద్యుత్ బిల్లులను వసూలు చేస్తూ పేదలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. మూడు నెలలుగా ఉపాధిలేని ప్రజలు ఈ విద్యుత్ బిల్లుల భారాన్ని ఏలా మోస్తారంటూ ప్రశ్నించారు. కష్టకాలంలో ప్రజలపై ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకని, మూడు నెలలు స్వీయ గృహానిర్బంధంలో ఉన్నపేదలకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటూ ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని మద్యం దుకాణాలు తెరిచావు.. ప్రజాసమస్యలపై పోరాడితే అరెస్టు చేయిస్తారా..? ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.