- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రి గడ్కరీతో ఎంపీ అర్వింద్ భేటీ.. అధికారులకు కీలక ఆదేశాలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల వన్నెల్, ముప్కాల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎంపీ అర్వింద్‌ని కలిసి నేషనల్ హైవే 44 పై బాల్కొండ సబ్ స్టేషన్ వద్ద, ముప్కాల్ జంక్షన్‌ల వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.
అంతే కాకుండా ముప్కాల్ జంక్షన్ వద్ద అండర్ పాస్‌ను, బాల్కొండ మండలం వన్నెల్ వద్ద రోడ్డుకిరువైపులా సర్వీస్ రోడ్లు లేని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అర్వింద్‌కు తెలియజేశారు. రోడ్డుకిరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని విన్నవించిన అంశాలను ఎంపీ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి, ఈ సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు తెలియజేశారు.