భారీగా తరలిన భక్తులు.. ఘనంగా ఆలయ వార్షికోత్సవం

by Shyam |
MP Bibi Patil, MLA Hanmant Shinde
X

దిశ, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి శివారులోని అంజనాద్రి ఆలయ 5వ వార్షికోత్సవంలో జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో గెస్ట్‌లను అంజనాద్రి వ్యవస్థాపకులు ఘనంగా సన్మానించారు. ఆలయం నిర్మించి ఐదేండ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేకంగా వార్షికోత్సవం నిర్వహించారు. మండలం నుండే కాకుండా మెదక్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గంగారెడ్డి, విట్టల్, ఆనంద్ కుమార్, రమేష్, వెంకన్న, బాలయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story