- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఈటల’ సరే.. ఆ 77 మంది సంగతేంటి : బండి
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా పరిస్థితులపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనాను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని అన్నారు. కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితి మరీ గంభీరంగా ఉందని, కరోనాపై సీఎం కేసీఆర్ కనీసం రివ్యూ చేయడం లేదన్నారు. తనకు కరోనా సోకితే వ్యాక్సిన్ తీసుకోలేదని, ఎవరిని తీసుకోమని చెప్పలేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. గతంలో జిల్లాల లెక్కలకు, రాష్ట్ర లెక్కలకు తేడా ఉండేదని.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందన్నారు.
వాస్తవ విషయాలు చెబితే ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరని సూచించారు. ఆరోగ్యమంత్రి ఈటల శాఖ మార్చారని ఇప్పుడే తెలిసిందని, ఏ శాఖలో డబ్బులో ఎక్కువగా ఉంటే ముఖ్యమంత్రి దానిని అంటిపెట్టుకుంటాడని బండి విమర్శించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు, మరణాలపై రోజువారీ బులెటిన్ విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలంటే ఆరోగ్యశ్రీ ఉందని చెబుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఒక మంత్రిపై చర్యలు తీసుకుంటే మొత్తం నీతివంతం అయిపోదని కబ్జాలు, అవినీతికి పాల్పడుతున్న మిగతా మంత్రులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల కబ్జాలు, అవినీతిని బయటపెట్టింది తామేనని దీనిని ముఖ్యమంత్రి స్పష్టత నివ్వాలన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా నివేదిక, అమీన్ పూర్ భూముల స్కాంపై చర్యలు ఎన్నడు తీసుకుంటారని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కరోనా నుంచి దృష్టి మరల్చడానికే ఈటల రాజేందర్ శాఖ తొలగించి పొలిటికల్ హడావుడి సృష్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రెండు రకాలుగా ఉందని.. ఒకటి అనుకూల, రెండు వ్యతిరేక అవినీతి ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై చర్యలు తీసుకుంటే సరిపోదని, అనుకూల వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి మల్లారెడ్డి అక్రమాలపై హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలెక్టర్ ఎదుట భూమి ఆక్రమించి ఇల్లు కట్టాడు. ఆలేర్ ఎమ్మెల్యే సునీతా, ఆమె భర్త దేవాదాయ భూముల్లో వెంచర్లు వేశారని, అదేవిధంగా ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, వినయ్ భాస్కర్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తంగా 77 మంది టీఆర్ఎస్ నేతలపై కబ్జా ఆరోపణలు ఉన్నాయని బండి గుర్తుచేశారు.