కొడుకు కోసమే కేసీఆర్ కుట్రలు, టూర్ల కోసమే లాక్‌డౌన్ ఎత్తివేత : ఎంపీ అరవింద్

by Anukaran |   ( Updated:2021-06-27 04:48:46.0  )
MP-Arvind
X

దిశ, జమ్మికుంట : రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి పర్యటనల కోసమే లాక్‌డౌన్ ఎత్తివేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆలస్యంగా లాక్‌డౌన్ పెట్టింది.. ముందే ఎత్తేసింది తెలంగాణ ప్రభుత్వమేనని మండి పడ్డారు. నీ కొడుకే సమర్థుడైతే హుజురాబాద్ ఎన్నికల్లో కేటీఆర్‌ను నిలబెడితే ప్రజలే నిర్ణయిస్తారన్నారు. హుజురాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు సరైన తీర్పు చెప్తారన్నారు.

ప్రజాప్రతినిధులకు ధరలు నిర్ణయించి సంచులకొద్ది డబ్బులు పంపించారని ఆరోపించారు. చాలా మంది టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకుని ఈటల రాజేందర్‌కు ఫోన్ చేస్తున్నారన్నారు. కొడుకు అధికార దాహం కోసం వచ్చిన ఎన్నికలే తప్ప మరోటి కాదన్నారు. కేసీఆర్ కన్నా పెద్ద బేవకూఫ్‌ను రాజకీయాల్లో తానైతే చూడలేదని అరవింద్ వ్యాఖ్యానించారు. పైసలు తీసుకోగానే ఓట్లేస్తారా..? టీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని చెప్పారు. చివరకు నాకు ఇచ్చినా డబ్బులు బాజాప్తా తీసుకుంటానని అదంతా ప్రజల సొమ్మేనని, నిజామాబాద్ ఎన్నికల్లో కూడా.. తాను ఇదే నినాదం ఇచ్చానని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. కేసీఆర్ పిల్లలు అమెరికాలో ఉన్నప్పుడు కారుతో యాక్సిడెంట్ చేస్తే ఆస్పత్రిలో బిల్లులు కట్టేందుకు డబ్బులు కూడా లేకుండే అని అరవింద్ ఆరోపించారు.

అలాంటిది ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతో.. అంతో రాజకీయం చేస్తున్న వారంతా లక్‌పతీలు అవుతున్నారని, బాజాప్తాగా డబ్బులు తీసుకుని కమలానికి ఓటేయ్యాలని అరవింద్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ ఎన్నికలే టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాందీ పలుకుతుందని స్ఫష్టం చేశారు. కలెక్టర్లతోటి కాళ్లు మొక్కిచ్చుకుంటున్నారు, ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరమన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వ అధికారులు బానిసలుగా పని చేయాల్సి వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకుని డ్యూటీ సక్రమంగా నిర్వర్తించాలని అరవింద్ కోరారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ఈటల రాజేందర్‌ను బయటకు పంపించారని, టీఆర్ఎస్ పార్టీ పునాదులు వేసిన వ్యక్తుల్లో ఈటల రాజేందర్ ఒకరు అని చెప్పుకొచ్చారు.

కొడుకు భవిష్యత్తు కోసం పొగబెట్టి ఈటలను బయటకు పంపారని అన్నారు. కేసీఆర్‌కు సిగ్గు,శరం, దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్‌ను హుజరాబాద్‌లో నిలబెట్టాలని సవాల్ విసిరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బెడ్లు, ఆక్సిజన్ లేకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నా.. హెల్త్ స్కీమ్ పెట్టలేదని విరుచుకుపడ్డారు. అధికారులు ఓవర్ యాక్షన్ బంద్ చేయాలని, బానిస బతుకులు బతక వద్దని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కడే ముఖ్యమంత్రి కాదని, రాష్ట్రంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఉన్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story