- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయ్యా కొడుకులకు ‘కాషాయం’ గుబులు..
దిశ, అల్వాల్ : అయ్యా కొడుకులకు కాషాయం గుబులు పట్టుకున్నదని నిజామాబాద్ఎంపీ అర్వింద్ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మచ్చబొల్లారం సంజీవ రెడ్డి ఫంక్షన్హాల్లో మేడ్చల్‌జిల్లా అర్బన్ అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, భూదందాలు, హిందువులపై జరుగుతున్న దాడులకు టీఆర్ఎస్ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్పట్టభద్రుల ఎన్నికలు మినీ రాష్ట్ర ఎన్నికలను తలపిస్తున్నాయని, ఇది టీఆర్ఎస్ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేక తీర్పుకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఓడిపోతామని తెలిసే పీవీపై ఉన్న సెంటిమెంట్ అయినా పనికి రాకపోతదా అని ఆయన కుమార్తెను బరిలోకి దింపారన్నారు.
నిజంగా పీవీ కూతురుపై ప్రేమే ఉంటే ఓడిపోయినా నామినేటేడ్ పదవి ఇవ్వగలరా అని టీఆర్ఎస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న కళ నెరవేరాలంటే మేధావులైన పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు రాంచంద్రర్రావుకు వేయాలని కోరారు. తీస్మార్క్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న మైనంపల్లి హన్మంతరావు ఏడువందల ఓట్లతోని గెలిచి విర్రవీగడం కాదని, వచ్చే ఎన్నికల్లో ఏడు వేల ఓట్లతో బీజేపీ మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగురవేస్తుందని జోష్యం చెప్పారు. అంతకుముందు హరీశ్‌రెడ్డి, అరుల్‌రాజు, శ్రావణ్‌గౌడ్, రాశి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో రవిందర్‌రెడ్డి, మచ్చబొల్లారం డివిజన్ అధ్యక్షుడు ప్రకాశ్‌చౌదరి, నవీన్‌చంద్ర, సీనియర్ నాయకులు విసి. జగదీశ్, సామల సత్తిరెడ్డి, నిమ్మ కృష్ణరెడ్డి, నేమూరి శ్రీధర్‌గౌడ్, మల్లికార్జున్‌గౌడ్, కార్తీక్గౌడ్పాల్గొన్నారు.