కేంద్రం చర్యలతోనే నియంత్రణలో వైరస్

దిశ, దుబ్బాక: కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతోనే దేశంలో కరోనా వైరస్ నియంత్రణలో ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎల్.ఎన్.ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోవిడ్ -19 నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వాహనదారులకు ఇంధన కొరత సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఫిల్లింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీజె కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు విభీషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement