- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. చెత్త ట్రాక్టర్‌లో గణేష్ విగ్రహాల తరలింపు..
దిశ, ఏపీ బ్యూరో : పారిశుద్ధ్య కార్మికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెత్తను తరలించే వాహనాల్లో వినాయకుడి విగ్రహాలను తరలించారు. గణపతి విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో ఎక్కించి తరలించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో గుంటూరు కమిషనర్ పారిశుద్ధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గణపతి విగ్రహాలను పారిశుద్ధ్య ట్రాక్టర్‌లో వేసి తీసుకెళ్లడంపై కమిషనర్ అనురాధ మండిపడ్డారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు.
ఈ సందర్బంగా అనురాధ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలోని జ్వరాల ఆసుపత్రి సమీపంలో కొందరు వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. అయితే, విగ్రహాల విక్రయానికి అనుమతి లేదంటూ సోమవారం సాయంత్రం గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది.. విగ్రహాలను బలవంతంగా పారిశుద్ధ్య ట్రాక్టర్‌లో తరలించిన సంగతి తెలిసిందే.