- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జీబ్రా టీజర్ రిలీజ్.. యాక్షన్ క్రైమ్ కామెడీగా మూవీ
దిశ, సినిమా: సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా ‘జీబ్రా’. ‘లుక్ ఫేవర్స్ ది బ్రేవ్’ అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో.. సత్య రాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ‘జీబ్రా’ నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.
‘రెడీ.. నేను కూడా రెడీ’ అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్లో ‘మత్తు వదలరా’ ఫేం సత్య మరోసారి నవ్వులు పూయించాడు. అలాగే.. యాక్షన్ క్రైమ్ కామెడీగా ఆకట్టుకుంటున్న ఈ టీజర్లో ‘పుష్ప’ ఫేమ్ ధనంజయ విలన్ పాత్రలో కనిపించగా.. సునీల్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రజెంట్ ‘జీబ్రా’ టీజర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.