రెజీనాతో ప్రేమలో పడ్డ యంగ్ హీరో Sundeep Kishan..!

by Hajipasha |   ( Updated:2023-01-21 14:00:35.0  )
రెజీనాతో ప్రేమలో పడ్డ యంగ్ హీరో Sundeep Kishan..!
X

దిశ, సినిమా: సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు ఏదైనా సరే.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే తమ పర్సనల్ విషయాలకు సంబంధించి కొంతమంది సెలబ్రిటీలు డైరెక్ట్‌గా బహిర్గతమైతే... మరి కొంతమంది ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇస్తారు. ఇండైరెక్ట్ హింట్‌లతో చాలామంది రకరకాల వార్తలు క్రియేట్ చేస్తుంటారు. రీసెంట్‌గా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనాల మేటర్ మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. అసలు విషయం ఏమిటంటే, డిసెంబర్ 13న చెన్నై ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా తన 32 వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఆమెకు ట్యూటర్ వేదికగా బర్త్ డే విషెస్ చెప్పాడు. ఇందులో "లవ్ యూ" అనే మాట కూడా వాడాడు. దీంతో ఒక కొత్త జంట బయట పడింది. ఇక వీరిద్దరూ సీక్రెట్‌గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారంటే నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

READ MORE

అందుకే సీక్రెట్‌గా ఉంచా.. తన ప్రెగ్నెన్సీ టైమ్ గురించి శ్రియ స్పందన

Advertisement

Next Story