- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు చాలా సార్లు పెళ్లి చేశారంటూ యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అసలు ఏం జరిగిందంటే?
దిశ, సినిమా: కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రమ్య తెలుగులో కళ్యాణ్ రామ్ ‘అభిమన్యు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ ఈ మూవీ పెద్దగా హిట్ అందుకోకపోవడంతో ఈ అమ్మడు మళ్లీ కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ పలు చిత్రాల్లో నటించిన ఆమె 2016లో పూర్తిగా సినిమాలకు దూరం అయింది. సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది. అయినప్పటికీ రమ్య పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అయితే ఇటీవల రమ్య ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుందని తొందరలోనే పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఇతనే వరుడు అంటూ ఓ ఫొటో కూడా వైరల్గా మారింది. ఈ క్రమంలో.. తాజాగా, రమ్య ఇన్స్టా వేదికగా పెళ్లి వార్తలపై స్పందిస్తూ షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘మీడియా వ్యక్తులు ఇప్పటికే నాకు చాలా సార్లు పెళ్లి చేశారు. ఎన్నిసార్లు చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను ఒకవేళ పెళ్లి చేసుకుంటే అధికారికంగా తెలియజేస్తాను. దయచేసి ఇలాంటి రూమర్స్ వైరల్ చేయడం ఆపండి’’ అని రాసుకొచ్చింది.