- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వైసీపీ ఎంపీ స్పెషల్ విషెస్
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో అత్యంత ప్రముఖ చలన చిత్ర అవార్డుల్లో ఒకటిగా పరిగణించబడుతున్న ‘నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్’ను 2021 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 69 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటుకున్నాయి. ఏకంగా 10 అవార్డులు సొంతం చేసుకోగా.. 6 అవార్డులు ఆర్ఆర్ఆర్, 2 అవార్డులు పుష్ప సినిమాలు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడు అవార్డు కైవసం చేసుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు.
దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తన ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్‌కు విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ‘‘జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమాకు అభినందనలు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్, ఉత్తమ పాపులర్ మూవీ RRR, దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌కు ప్రత్యేక అభినందనలు’’ అంటూ చెప్పుకొచ్చారు.
Read More: అల్లు అర్జున్‌కి శుభాకాంక్షలు తెలుపని చరణ్ కారణం అందేన..!