మళ్లీ పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..

by sudharani |   ( Updated:2023-10-10 14:59:56.0  )
మళ్లీ పెళ్లి చేసుకున్న యాదమ్మ రాజు..
X

దిశ, సినిమా: పటాస్ షో ద్వారా కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు.. ప్రజంట్ జబర్దస్త్ షో లో సందడి చేయడమే కాకుండా పలు చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. ఇకపోతే రీసెంట్‌గా యాదమ్మ రాజు స్టెల్లాను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ దంపతులు మరోసారి మ్యారేజ్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు.

ఈ జంట తిరిగి మళ్లీ పెళ్లి చేసుకోవడానికి కారణం.. పెద్దల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నటు వంటి వీరిద్దరు తమ వివాహాన్ని చట్టబద్ధం చేయాలనే ఉద్దేశంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరిని పట్టుబట్టలతో వచ్చి అక్కడ దండలు మార్చుకోవాలని, స్వీట్ తేవాలని, ఆ తర్వాత వాళ్ల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెప్పడంతో ఇలా చేశారని టాక్.

Advertisement

Next Story