Prisha Singh: టాలీవుడ్‌లో వ‌ర్క్ చేయ‌టం బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌.. బడ్డీ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!

by Hamsa |   ( Updated:2024-07-23 11:21:09.0  )
Prisha Singh: టాలీవుడ్‌లో వ‌ర్క్ చేయ‌టం బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌.. బడ్డీ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘బడ్డీ’. ఈ సినిమాలో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ ఆగస్టు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రిషా సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘‘నా ఫొటోల‌ను చూసి ఆడిష‌న్‌కు పిలిస్తే వచ్చి సెల‌క్ట్ అయ్యాను. అయితే పాత్ర‌లోని వేరియేష‌న్స్ చూసి నేను చేయ‌గ‌ల‌నా! అని కూడా ఆలోచించాను. బ‌డ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్ పాత్ర‌లో క‌నిపిస్తాను. అందుకోసం నేను చాలా మంది ఎయిర్ హోస్టెస్‌ను గ‌మ‌నించాను. వారెలా న‌డుస్తారు.. ఎలా మాట్లాడుతారు, ఇత‌రుల‌తో ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు వంటి విష‌యాల‌ను పరీక్షించాను.

ఈ క్ర‌మంలో డైరెక్ట‌ర్‌గారు ఎయిర్ హోస్ట‌స్ పాత్ర చేయ‌టానికి నాకు కొన్ని రెఫరెన్స్‌ల‌ను ఇచ్చారు. అవి నాకు చాలా ఉప‌యోగ‌ప‌డ్డాయి. అయితే టాలీవుడ్‌లో న‌టించడం న‌టిగా నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఇంకా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌టానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను’’అని చెప్పుకొచ్చింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్ర‌ఫీ అంటే ఇష్టపడటానికి కారణం చెబుతూ.. ‘‘వైల్డ్ లైఫ్ అంటే కేవ‌లం జంతువుల‌ను, చెట్ల‌కు సంబంధించిన ఫొటోల‌ను కెమెరాల్లో బంధించ‌టం మాత్ర‌మే కాదు. వాటికి సంబంధించి స‌హ‌జ‌మైన భావోద్వేగాల‌ను బంధించ‌ట‌మే. అలాంటి విష‌యాల‌ను నా కెమెరాలో బంధించిన‌ప్పుడు సంతృప్తిని, మంచి అనుభ‌వాన్ని ఇస్తుంది. మనం కెమెరాలో బంధించే ప్రతి విషయానికి బలమైన కథ ఉంటుంది. న‌ట‌న ప‌రంగానూ ఇది నన్ను మెరుగుప‌రుచుకునేలా చేసింది. కెమెరా ముందు ధైర్యంగా న‌టించ‌గ‌లుగుతున్నాను’’ అని తెలిపింది.

Advertisement

Next Story