చనిపోయినంత పనైంది.. చెప్పడానికి మాటలు సరిపోవట్లేదంటూ శ్రద్దా దాస్ ఎమోషనల్ ట్వీట్లు

by Hamsa |   ( Updated:2024-02-20 06:33:14.0  )
చనిపోయినంత పనైంది.. చెప్పడానికి మాటలు సరిపోవట్లేదంటూ శ్రద్దా దాస్ ఎమోషనల్ ట్వీట్లు
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలకు విమాన ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ముంబై నుంచి హైదరాబాద్‌లో రావాల్సిన ఓ విమానంలో టాలీవుడ్ భామలు రష్మిక, శ్రద్దా దాస్ కూడా ఉన్నారు. తమకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చావు నుంచి తప్పించుకున్నామని రష్మిక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.

తాజాగా, శ్రద్దా దాస్ స్పందించి ఎమోషనల్ ట్వీట్లు చేసింది. ‘‘ ఒకవేళ సాంకేతిక లోపాలు ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు విమానాలను విస్తారా చెక్ చేసుకోవాలి. మేం నిన్న దాదాపు చనిపోయినంత పనైంది. దాన్ని వివరించేందుకు నాకు మాటలు కూడా సరిపోవడం లేదు. సరైన సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పైలెట్ సరైన నిర్ణయం తీసుకున్నారు. విమానంలో ఎప్పుడైనా 100 మందికి పైగానే ఉంటారు. ఒకానొక బెస్ట్‌గా ఉంటుందని విస్తారాకు పేరుంది. ఈ విషయాన్ని పరిశీలించండి. మేం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాం కానీ ఎప్పుడో ఒకసారి దారుణం జరగొచ్చు’’ అంటూ వరుస ట్వీట్లు చేసింది.

Advertisement

Next Story