ఇంతకు ముందు ఎప్పుడు షేర్ చేయలేదు నాకే ఆశ్చర్యంగా ఉంది: ఉపాసన పోస్ట్

by sudharani |   ( Updated:2023-05-29 07:28:13.0  )
ఇంతకు ముందు ఎప్పుడు షేర్ చేయలేదు నాకే ఆశ్చర్యంగా ఉంది: ఉపాసన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్‌ అన్న విషయం తెలిసిందే. ఓవైపు చెర్రీకి భార్యగా.. మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేశారు ఉపాసన. ఇక మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది.. అయితే రామ్ చరణ్ షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఆసక్తికర పోస్టులతో ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా, కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన రెడ్ కలర్ సారీలో ఉన్న పిక్స్‌కు పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ‘నా ఫోన్‌లో ఉన్న ఇంత మంచి ఫొటోలను ఇంతకు ముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి మహేష్ బాబు సతీమణి నమ్రత స్పందిస్తూ ‘ నేను అదే చెప్పాలనుకుంటున్నాను’ అని రిప్లై ఇచ్చింది.

Read More... సాయి పల్లవి నా క్రష్..ఆమె నెంబర్ కూడా ఉంది..ఎదో ఒక రోజు ఆమెను కలుస్తా: గుల్షన్ దేవయ్య

Ananya Nagalla: అన్నం బదులు రోజూ అందం తింటున్నారా ఏంటి అంటూ.. కామెంట్ చేసిన ఓ నెటిజెన్

Advertisement

Next Story