వర్మకు క్యాస్ట్ ఫీలింగ్.. అందుకే కృష్ణం రాజు విషయంలో అలాంటి ట్వీట్?

by sudharani |   ( Updated:2022-09-13 15:29:45.0  )
వర్మకు క్యాస్ట్ ఫీలింగ్.. అందుకే కృష్ణం రాజు విషయంలో అలాంటి ట్వీట్?
X

దిశ, సినిమా: సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత కృష్ణం రాజు ఆదివారం అనారోగ్య స‌మ‌స్యల‌తో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. కాగా సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాపంగా షూటింగ్‌లు ఆపకపోవడంపై ఫైర్ అయ్యాడు వర్మ. 'భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలను అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు.

సిగ్గు! సిగ్గు!' అంటూ మండిపడ్డాడు. కాగా ఈ ట్వీట్ కాస్త వైరల్ కాగా.. డెత్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని హితబోధ చేసే వర్మ ఫస్ట్ టైమ్ ఇలా రియాక్ట్ అయ్యేందుకు కారణాలేంటని శోధించగా క్యాస్ట్ ఫీలింగ్ అని బయటపడిందని విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఇంతకు ముందు కూడా 'సాహో' రిలీజ్ సమయంలో భీమవరంలో పెద్ద ఎత్తున ప్రభాస్ అభిమానులు బ్యానర్లు కట్టిన వీడియోను వర్మ షేర్ చేసి 'నాకు క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఎక్కువ. అందుకే నాకు ప్రభాస్ అంటే ఇష్టం' ఉన్నట్టు కామెంట్ చేసిన సందర్భాలు కూడా గుర్తు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

మొగుడు లేకుండానే బిడ్డను కనాలని ఉంది: 'Sita Ramam actress Mrunal ఠాకూర్

బ్రా' లేకుండానే బయటకొచ్చిన Radhika Madan.. పిచ్చెక్కిస్తున్న పిక్స్

రాత్రికి వస్తవా.. Srimukhi ని వేధించిన యాంకర్.. ఎవరంటే?

Advertisement

Next Story