- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఒక్క మ్యాటర్ తో మళ్లీ సీన్ రివర్స్.. గబ్బు లేపుతున్న రేణు దేశాయ్ కామెంట్స్!
దిశ, సినిమా: తెలుగులో ‘బద్రి’ సినిమాలో నటించి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళు కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా వీరికి అఖిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పేర్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో మారుమ్రోగి పోతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నప్పుడు రేణు దేశాయ్ ఈ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకోలేదు . కానీ ఎప్పుడైతే ఆయన విడాకులు ఇచ్చేసాడొ అప్పటి నుంచి రేణు దేశాయ్ తనదైన స్టైల్ లో ఘాటుగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అలాగే మరికొందరు విడిపోయిన సరే నువ్వు మా వదినమ్మవి అంటూ ప్రేమగా పలకరించే వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ మళ్లీ నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పేరును బ్రష్టు పట్టించేలా చేశాయి. ఇందులో భాగంగా.. నాకు నా పిల్లలు అంటే చాలా ఇష్టం వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. నా కెరీర్ గురించి నేను ఎక్కువ ఆలోచించను. అంతేకాదు ప్రతి ఒక్క రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకరు హ్యాపీగా ఉంటే ఒకరు ఏడుస్తూనే ఉంటారు.. నేనేమి స్పెషల్ కాదు కదా..? నా లైఫ్ కూడా అంతే. ఇక పవన్ కళ్యాణ్ గురించి నన్ను ఏం అడగొద్దు ఎందుకంటే ఆయన గురించి నేను ఏం మాట్లాడినా దానిని తప్పుగానే రాస్తున్నారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు నేను ఒకటి చెప్తే దానిలో ఉన్న ఇంపార్టెంట్ విషయాన్ని వదిలేసి వేరొక విషయాన్ని పట్టుకొని ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ పేర్లు మరోసారి నెట్టింట బాగా హాట్ టాపిక్ గా మారింది.