Sai Dharam Tej: న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు.. మెగా హీరో పోస్ట్ ఎవరి గురించంటే?

by Hamsa |
Sai Dharam Tej: న్యూ జర్నీ స్టార్ట్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు.. మెగా హీరో పోస్ట్ ఎవరి గురించంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా అసలు విషయం రివీల్ చేశాడు. నందమూరి వారసుడి సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుపుతూ మోక్షు ఫస్ట్ లుక్‌ను కూడా ట్విట్టర్ వేదికగా విడుదల చేసి అభిమానుల ఆనందానికి కారణం అయ్యాడు.

అయితే ఈ సినిమాను ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్, బాలయ్య చిన్న కూతురు తేజస్విని కలిసి నిర్మిస్తున్నారు. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూవివర్స్‌లో వస్తున్న రెండో ప్రాజెక్ట్. అయితే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వడంతో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

తాజాగా, మెగా హీరో ట్విట్టర్ వేదికగా మోక్షుకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘మోక్షు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినందుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ రోజు నుండి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. మా అపురూపమైన తెలుగు ప్రేక్షకుల ప్రేమతో మీకు అద్భుతమైన ఎంట్రీ అవుతుందని భావిస్తున్నా. ప్రశాంత్ వర్మ ఈ కొత్త విహారయాత్ర కూడా మీ అందరికీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story