- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయనే నా ఫస్ట్ లవ్.. ఒక్క రోజు మీ భర్తను నాకు ఇస్తారా.. ఫ్యాన్ కోరికకు జ్యోతిక రియాక్షన్ ఇదే
దిశ, సినిమా: బాలీవుడ్ నుండి తాజాగా విడుదలైన సైకాలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘సైతాన్’. వికాస్ బహల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. 2023లో గుజరాతీలో వచ్చిన ‘వశ్’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ సొంతం చేసుకోవడంతో పాటు.. రూ. 100 కోట్ల మార్క్ దాటి సెన్సెషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఈ సినిమా గురించి స్పందిస్తూ.. తాజాగా ఎమోషన్ పోస్ట్ పెట్టింది జ్యోతిక.
‘కొన్ని సినిమాలు కేవలం గమ్యస్థానాలు మాత్రమే! కానీ ‘సైతాన్’ సినిమా ప్రయాణం మాత్రం అందమైన ఆనందం. జీవితానికి సరిపడే అంతా సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నో జ్ఞాపకాలు, సృజనాత్మకత, ప్రతిభ, ఇంకా ఎందరో స్నేహితులను ఈ ప్రయాణంలో అందించింది. ఈ సార్థక ప్రయాణంలో నన్ను భాగస్వామ్యాన్ని చేసినందుకు దేవగన్ ఫిల్మ్‌లు, పనోరమా స్టూడియోలు, జియో స్టూడియోలకు ధన్యవాదాలు. మొత్తం టీమ్‌కి అభినందనలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. మూవీ టీంతో పాటు తన భర్త సూర్య కూడా ఉన్న ఫొటోలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రకరకాలుగా స్పందిస్తున్నారు అభిమానులు.
అందులో ఓ లేడీ ఫ్యాన్.. ‘జ్యోతిక మేడం.. ‘సిల్లును ఒరు కాదల్’ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా..? 15 ఏళ్లుగా ఆ జెంటిల్‌మెన్‌కు పెద్ద ఫ్యాన్ నేను’ అంటూ కామెంట్ పెట్టింది. ఈ కామెంట్‌పై స్పందించిన జ్యోతిక.. ‘అది కుదరదు’ అంటూ రిప్లై ఇచ్చింది. జ్యోతిక తన కామెంట్‌కు రిప్లై ఇవ్వండతో.. ఆనందంతో ‘ఓ మై గాడ్.. మీరు నాకు రిప్లై ఇచ్చారా. నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానిని అంటే నా పేరులో ఆయన పేరు కూడా యాడ్ చేసుకున్నాను. జ్యో మేడం.. ఆయన ఎప్పుడూ మీ వారే’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లు వైరల్ అవుతున్నాయి.