నీ మొహానికి హీరోయిన్ అవుతావా అన్నారు: ‘బలగం’ నటి కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-04-25 15:17:36.0  )
నీ మొహానికి హీరోయిన్ అవుతావా అన్నారు: ‘బలగం’ నటి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వేణు దర్శకత్వంలో వచ్చిన ‘‘బలగం’’ చిత్రం.. అతి తక్కువ బడ్జెత్‌తో తెరకెక్కి భారీ విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని నటుల ఇంటర్వ్యూ కోసం మీడియా వారు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో హీరో ప్రియదర్శిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పాత్రలో సౌధామిని నటిస్తుంది.

హీరో తాత చనిపోయినపుడు ఆమె వాళ్ల ఇంటికి వస్తుంది. చావు ఇంట్లో ఆమెకు ప్రియదర్శిని మర్యాదలు చేసే సీన్స్ నెటిజన్లను ఎంతగానో నవ్వించాయి. అయితే సౌధామిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘‘ నేను ఈ సినిమాలో అవకాశం కోసం మా అన్నయ్యను తీసుకొని వేణు ఆఫీసుకు వెళ్లాను. ఆయన నన్ను సిగ్గుపడుతూ నటించి ఓసారి చూపించమన్నారు.

దీంతో నా నటన నచ్చి.. ఓకే చేశారు. డైరెక్టర్ వల్లనే నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ ఫోన్ చేసి.. తన సినిమాలో నాకు అవకాశం ఇస్తానని చెప్పారు.’’ అంటూ ఈ నటి వెల్లడించారు. అలాగే ఆమెను ‘నీ ఫేస్‌కు నువ్వు హీరోయిన్ అవుతావా? ’ అని ఎందరో నాపై కామెంట్లు చేశారని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

‘రామబాణం’ అందరినీ అలరించే ఎంటర్‌‌టైనర్‌ : డింపుల్ హయతి

Advertisement

Next Story

Most Viewed