‘దేవర’ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు రానున్నారా? తెగ ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతోన్న ఫ్యాన్స్

by Anjali |   ( Updated:2024-09-09 14:57:47.0  )
‘దేవర’ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు రానున్నారా? తెగ ఎగ్జైటింగ్‌గా ఫీల్ అవుతోన్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబరు 27 వ తారీకున థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ ఫిల్మ్ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు మేకర్స్. తారక్ అండ్ జాన్వీ రొమాంటిక్ సాంగ్స్ కు, పోస్టర్లకు ప్రేక్షకుల వద్ద నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ నెల (సెప్టెంబరు) 10 వ తేదీన ముంబయిలో దేవర చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ వార్త విన్న నెటిజన్లు మరో రెండ్రోజుల్లో తారక్ అండ్ సూపర్ స్టార్‌ను ఒకే వేదికపై చూడబోతున్నామంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed