Kangana Ranaut: కంగనా రనౌత్ సినిమాలకు వీడ్కోలు చెప్పనుందా?

by Prasanna |   ( Updated:2024-08-15 15:46:20.0  )
Kangana Ranaut: కంగనా రనౌత్ సినిమాలకు వీడ్కోలు చెప్పనుందా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయింది. మూవీస్ తో సంపాదించుకున్న క్రేజ్ తో రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టింది. ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసిన కంగనా ఎంపీ గా గెలిచి అందరికీ తానేంటో మళ్ళీ నిరూపించింది. ఎమర్జెన్సీ అనే మూవీతో మన ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ మూవీ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా రిలీజ్ చేసిన ఎమర్జెన్సీ ట్రైలర్‌ యూ ట్యూబ్ లో రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. 2 నిమిషాల 53 సెకన్ల ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ అద్భుతంగ నటించింది. ఇండో – పాక్ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణ‌యాలు.. ట్రైలర్లో హైలెట్ గా నిలవనున్నాయి. అలాగే మన దేశంలో చీక‌టిరోజులుగా చెప్పుకునే ‘ఎమర్జెన్సీ’ గురించి అతి త్వరలో చూడబోతున్నాం.

అయితే, కంగనా రనౌత్ ఈ సినిమాకి ముందు ఐదు సినిమాలలో నటించింది. కానీ, వాటిలో ఏది కూడా హిట్ కాలేదు దీంతో ఈ అమ్మడి మార్కెట్ తగ్గింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంగనా రనౌత్ రెండు పడవల మీద కాలు వేస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయం. రెండు బ్యాలెన్స్ చేసే సమయంలో కష్టంగా అనిపిస్తే ఆమె నటనకే గుడ్ బై చెబుతుందనే టాక్ వినిపిస్తుంది. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story