ఎప్పటికైనా మెగాస్టార్‌లా డాన్స్ చేస్తా.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్

by Nagaya |   ( Updated:2024-02-06 14:37:46.0  )
ఎప్పటికైనా మెగాస్టార్‌లా డాన్స్ చేస్తా.. సాయి పల్లవి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. రియాలిటీ షో డ్యాన్సర్ నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిత్రం ప్రేమమ్. ఆ మూవీలో మలర్ పాత్రలో మంచి పెర్పామన్స్‌తో ప్రేక్షకుల మనుసు గెలుచుకుంది. ప్రేమమ్ మూవీ తర్వాత సాయిపల్లవికి బిగ్ ఆఫర్ వచ్చింది. ఫిదా సినిమాలో ఛాన్స్ రావడంతో బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ డాన్స్‌కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఇండస్ట్రీలో అందరి హీరోయిన్స్ కంటే ఈ ముద్దుగుమ్మ బాగా డ్యాన్స్ చేస్తుందానే టాక్ ఉంది. అలాంటి ఈ బ్యూటీకి ఒక సాంగ్‌కు డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించిందని చెప్పింది. ఆ పాట మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రీ మూవీలోని మార్కెట్‌లో వచ్చే‘ఈ పేటకు నేనే మెస్త్రీ’ అనే టైటిల్ సాంగ్ కావడం గమనార్హం. అయితే ఈ పాటకు ఎంతో ట్రై చేసినప్పటికీ తనకు ఆ మూమెంట్స్ రాలేదని చెప్పింది. కానీ ఎప్పటికైనా మెగాస్టార్‌లా ఆ పాటలో డాన్స్ చేస్తానని చెప్పింది. ప్రస్తుతం ఆమె గతంలో చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

Advertisement

Next Story