Mahesh Babu: రాజమౌళి కండీషన్లు మహేష్ బాబుకు ఎందుకు లేవంటే..?

by Prasanna |
Mahesh Babu: రాజమౌళి కండీషన్లు మహేష్ బాబుకు ఎందుకు లేవంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా దర్శకధీర రాజమౌళితో ఎవరైనా సినిమా చేస్తుంటే బయట ఎక్కువగా కనిపించరు. ఆయన పర్మిషన్ లేనిదే ఎక్కడికి వెళ్ళకూడదు. ఆర్ఆర్ఆర్ సమయంలో రామ్ చరణ్ ఆచార్యలో నటించడానికి కొరటాల శివ, చిరంజీవి ఇద్దరూ అడగాల్సి వచ్చింది. ఇక పబ్లిక్ ఈవెంట్లలో అసలే కనిపించేకూడదు. కానీ, మహేష్ బాబుకి ఈ సారి ఎలాంటి కండీషన్స్ పెట్టలేనట్టు తెలుస్తుంది.

బయట చాలా ఈజీగా తిరిగేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళం అందించే సమయంలో మహేష్ బాబు లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంత వరకు ఏ హీరోకు ఇవ్వలేని ఫ్రీడమ్ మహేష్ కు ఎందుకు ఇచ్చాడనే డౌట్ రాకుండా ఉండదు.

ఇక్కడే ఉంది అసలు మ్యాటర్.. ఇప్పుడు మనం చూస్తున్న మహేష్ లుక్ ఇది కాదట. జులపాల జుట్టు, గుబురు గెడ్డం, మీసం పెంచాక ఆ తర్వాత లుక్ కోసం విదేశాల నుంచి హెయిర్ స్టయిలిస్టులను పిలిపించబోతున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న లుక్ మీద ఇతర ఆప్షన్లతో వేరే డిజైన్లు తయారు చేయించే పనిలో రాజమౌళి ఉన్నారని సమాచారం. ఇదంతా ఇప్పట్లో అవ్వదు.. ఈజీగా మూడు నెలలు సమయం పడుతుంది. అందుకే మహేష్ ఎలాంటి టెన్షన్ లేకుండా తిరిగేస్తున్నాడు.

Advertisement

Next Story