పూరీ జగన్నాథ్ తన కొడుకుని ఎందుకు పట్టించుకోడు ?

by sudharani |   ( Updated:2023-10-12 14:15:07.0  )
పూరీ జగన్నాథ్ తన కొడుకుని ఎందుకు పట్టించుకోడు ?
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకడైన పూరీ జగన్నాథ్.. ‘బద్రి’ మొదలు రీసెంట్‌గా వచ్చిన ‘లైగర్’ సినిమా వరకు హీరోలను మాస్ అవతార్‌లో చూసించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఫ్లాప్ ట్రాక్‌లో ఉన్న ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. కానీ సొంత కొడుకు ఆకాశ్ పూరీని మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే.. పూరీ జగన్నాథ్ తన కొడుకుతో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన కథ చర్చలు కూడా నడుస్తున్నాయని టాక్. ఇప్పటికే ‘లైగర్’తో డిజాస్టర్ చవిచూసిన పూరి.. ‘డబుల్ ఇస్మార్ట్’ కనుక హిట్ అయితే తన కొడుకుని పాన్ ఇండియా లెవల్లో చూపించడానికి ఫుల్ ప్లానింగ్‌తో ఉన్నాడట.

Advertisement

Next Story