‘యానిమల్’ : అందుకే రష్మికను తీసుకుని.. పరిణీతిని పక్కన పెట్టేసిన సందీప్ రెడ్డి వంగా

by sudharani |   ( Updated:2023-12-01 12:11:09.0  )
‘యానిమల్’ : అందుకే రష్మికను తీసుకుని.. పరిణీతిని పక్కన పెట్టేసిన సందీప్ రెడ్డి వంగా
X

దిశ, సినిమా : సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’తో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇలాంటి సినిమాలు తాను మాత్రమే చేయగలడని నిరూపించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఫిల్మ్.. క్రిటిక్స్ అప్లాజ్ అందుకుంటోంది. మోస్ట్ వాయిలెంట్‌ ఫిల్మ్‌గా ప్రశంసలు పొందుతుంది. అయితే ఈ చిత్రంలో ముందుగా ఫిమేల్ లీడ్‌గా పరిణీతీ చోప్రాను ఎంచుకున్నాడు డైరెక్టర్. కానీ ఇంతియాజ్ అలీ ‘Chamkila’ కోసం కూడా సేమ్ డేట్స్ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. మేజర్ డేట్స్ ఓవర్ ల్యాప్ కావడంతో ‘యానిమల్’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. అయితే మరో న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ట్రయల్ షూట్స్‌లో పరిణీతి ఈ క్యారెక్టర్‌కు సెట్ కాలేదని సందీప్ ఆమెను వద్దనుకున్నాడని తెలుస్తుంది.

కాగా రష్మికను లీడ్ హీరోయిన్‌గా ప్రకటించిన తర్వాత స్పందించిన బాలీవుడ్ భామ.. ‘ఇలాంటివి జీవితంలో ఒక భాగం. ప్రతిరోజు మనం ఇలాంటివి చాలా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన, సరైన ఎంపిక చేసుకోవడం మంచిది’ అని తెలిపింది. కాగా సినిమా మొత్తం ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కనిపిస్తుండగా.. హీరోను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న అమ్మాయిగా మెప్పిస్తుంది రష్మిక.

Advertisement

Next Story