Koratala Shiva : ‘దేవర’ తర్వాత కొరటాల శివ ఏ హీరోని లైన్ లో పెట్టనున్నాడు?

by Prasanna |   ( Updated:2024-09-26 04:34:34.0  )
Koratala Shiva : ‘దేవర’ తర్వాత కొరటాల శివ ఏ హీరోని  లైన్ లో  పెట్టనున్నాడు?
X

దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తో చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో ఇక, శివకి తిరుగులేదని అనుకున్నారు కానీ, ఆచార్యతో ఫ్లాప్ పడింది ఇది ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో రెండు సినిమాలు తీసి హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేసి హిట్ కొట్టాడు. ఆచార్య తో స్లో అయిన కొరటాల మళ్ళీ దేవర తో కంబ్యాక్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కాబట్టి, హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు.

అయితే, దేవర తర్వాత కొరటాల శివ ఎవర్ని లైనులో పెట్టనున్నాడు.. అన్న ప్రశ్న అందరికి ఉంది. అయితే, వెంటనే దేవర పార్ట్ 2 ఉంటుందా ..లేక ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీ అయ్యాక దేవర 2 తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

గతంలో, అల్లు అర్జున్ కొరటాల కాంబినేషన్లో ఒక మూవీ ప్రకటించారు. కానీ, ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే, ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 టైం పడుతుంది కాబట్టి, ఈ లోపు కొరటాల శివ మధ్య ఓ సినిమా పక్కాగా చేస్తాడు. అయితే, అది బన్నీతోనే ఉండొచ్చని సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed