ఆ విషయంలో నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి.. శోభిత వైరల్ కామెంట్స్

by sudharani |   ( Updated:2023-09-13 11:47:07.0  )
ఆ విషయంలో నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి.. శోభిత వైరల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్2’ తో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గోంటున్న బ్యూటీ.. తన సినిమాల గురించి పర్శనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకుంది.

శోభిత మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండాలి అని అనుకుని.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అస్సలు ఒప్పుకోను. సినిమాల విషయంలో నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే నాకు నచ్చిన పాత్ర ఒప్పుకుంటాను. అయితే.. పాత్రల ఎంపికే తప్ప అవకాశాలనేవి మన చేతిలో ఉండవు. అలా జరిగితే.. కరణ్ జోహార్, ఫరాఖాన్ లాంటి గొప్ప దర్శకులతో నేను కలిసి సినిమా చేస్తాను. ఆ అవకాశం లేకపోవడంతో ఒప్పుకున్న సినిమాలనే మనసు పెట్టి చేస్తున్నాను. అలాగే స్టార్ డైరెక్టర్ మణిరత్నం పొన్నియిల్ సెల్వన్‌లో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రను నాకు ఇచ్చారు. నాలో ఉన్న ప్రతిభ గర్తించే ఆ అవకాశం నాకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More: ప్యాంటు లేకుండా వాటిని చూపిస్తూ నిహారిక బోల్డ్ షో.. పిక్స్ వైరల్

Advertisement

Next Story