కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే..

by Anjali |   ( Updated:2023-07-04 11:38:42.0  )
కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే..
X

దిశ, సినిమా: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లాస్ట్ ఇయర్ ‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి పలు భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకుంటున్న ఆయన.. ‘అమిగోస్’తో హిట్ కొట్టేశాడు. కాగా తాజాగా ‘డెవిల్’ మూవీతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు నవీన్ మేడారం తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ నుంచి, ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్.. నెట్టింట హల్ చల్ చేసినప్పటికీ.. మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. అయితే పిరియాడిక్ స్పై థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ గ్లింప్స్‌ను జూలై 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed