AAY Movie: ‘ఆయ్’ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Prasanna |   ( Updated:2024-09-01 14:16:19.0  )
AAY Movie: ‘ఆయ్’ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
X

దిశ,వెబ్ డెస్క్: ఎన్టీఆర్ బావ మరిదిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో నార్నే నితిన్ ‘మ్యాడ్’ మూవీతో సూపర్ హిట్ అందుకుని అదే ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. తాజాగా, ఈ యంగ్ హీరో ఆయ్ మూవీతో మన ముందుకొచ్చాడు. ఈ సినిమాకి అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహించారు. నితిన్ కి జోడిగా నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.

అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ పతాకం పై బన్నీ వాసు ఆయ్ మూవీని నిర్మించారు. ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో రన్ అవుతుంది.

స్టార్ హీరోల సినిమాలను కూడా వెనక్కి నెట్టి అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ లవ్ స్టోరీ సామాన్యులతో పాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కి కూడా బాగా నచ్చింది. థియేటర్లలో రన్ అవుతున్న ఆయ్ మూవీకి సంబంధించి ఓటీటీ విడుదల పై అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆరు వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సమాచారం. అంటే సెప్టెంబర్ మూడో వారం లేదా నాలుగో వారంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవ్వనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అనౌన్స్ రానుందని సమాచారం.

Advertisement

Next Story