- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జయా బచ్చన్ ఎమోషనల్; ఆయన కోమాలోకి వెళ్లినప్పుడు డాక్టర్లు ఏం చేయలేమన్నారు
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన భార్య జయా బచ్చన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 1983లో వచ్చిన ‘కూలీ’ సినిమా సెట్స్‌లో అమితాబ్ గాయపడిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య జయా బచ్చన్ మరోసారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. జయా బచ్చన్ మాట్లాడుతూ.. ‘‘ ఆ క్షణాలు ఇప్పటికీ నా కళ్లముందు కదులుతున్నాయి. నేను ఆసుపత్రికి వెళ్ళగానే మా బావగారు అక్కడే ఉన్నారు. అతను నన్ను ధైర్యంగా ఉండమని చెప్పారు. ఒక్కసారిగా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా చేతిలో హనుమాన్ చాలీసా ఉంది. డాక్టర్ మా దగ్గరకు వచ్చి మీ ప్రార్థనలే ఆయనను కాపాడతాయని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన బొటనవేలు కదలడాన్ని చూశా. డాక్టర్ ఈ విషయాన్ని మాతో చెప్పారు. ఆ తర్వాత మేం కాస్త ఊపిరి పీల్చుకున్నాము’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, అమితా బచ్చన్ 1983 ఆగస్ట్ 2న కూలీ సెట్స్‌లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనకు పొత్తి కడుపు ప్రాంతంలో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని జయాబచ్చన మరోసారి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
Also Read..
ఇప్పటికీ అమితాబ్‌ను లవ్ చేస్తున్న హీరోయిన్.. పెళ్లి చేసుకునేందుకు రెడీ