Ayesha Kaduskar: రామ్ చరణ్ చెల్లెలు ఏంటీ ఇంత హాట్‌గా ఉంది.. నెట్టింట ఫొటోలు వైరల్

by Kavitha |
Ayesha Kaduskar: రామ్ చరణ్ చెల్లెలు ఏంటీ ఇంత హాట్‌గా ఉంది.. నెట్టింట ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘గోవిందుడు అందరివాడేలే’ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చరణ్‌ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీలో చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన ఆ అమ్మడు గుర్తుందా.. అప్పుడు చిన్నపిల్లలా ఉన్న ఆ బ్యూటీ ఇప్పుడు హాట్ హాట్‌గా తయారైంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆ బ్యూటీ పేరు అయేషా కాదుస్కర్. ఈ మూవీలో కనిపించింది కొంతసేపే అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలానే ఉండే ఈ అమ్మడు ముంబైకి చెందిన నటి. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రోజు రకరకాల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది అయేషా. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అది చూసిన నెటిజన్లు ఏంటీ అప్పుడు చిన్నపిల్లలా ఉన్న ఆమె ఇప్పుడు ఇంత హాట్‌గా తయారైంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ అమ్మడి ఫోటోలపై ఓ లుక్కేయండి.


(video link credits to ayesha kaduskar instagram id)

Advertisement

Next Story