Janhvi Kapoor: హాస్పిటల్లో స్టార్ హీరోయిన్.. ఏమైందంటే ?

by Prasanna |
Janhvi Kapoor: హాస్పిటల్లో స్టార్ హీరోయిన్.. ఏమైందంటే ?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జూలై 12న అనంత్ అంబానీ ఇంట్లో పెళ్లికి హాజరైంది. అయితే, ఆ తర్వాత జాన్వీ కి ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఆమెను ఆస్పత్రిలో అడ్మిట్ చేసారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుందని సమాచారం. మరో రెండు రోజుల్లో ఆమె నార్మల్ అవుతుందని ఆమె తండ్రి బోణి కపూర్ తెలిపారు.

ప్రస్తుతం ఉలజ్ మూవీతో ప్రేక్షకుల సందడీ చేయనుంది. మూవీ రిలీజ్ అయ్యే సమయంలో ఇలా అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ అభిమానులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక ఈమె నటించనున్న సినిమాల గురించి మాట్లాడుకుంటే.. త్వరలోనే ‘ఉలజ్’ అనే సినిమా మన ముందుకు రానుంది. ఈ మధ్యకాలంలో మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. ఇక తెలుగులో అయితే మూడు సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జోడిగా దేవర మూవీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC 16లో, తాజాగా హీరో నానితో కూడా ఓ మూవీ చేయనుంది. ఇలా వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది.

Advertisement

Next Story