- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hero Raviteja: మాస్ మహారాజ్ రవితేజకు ఏమైంది.. ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
దిశ, సినిమా : మాస్ మహారాజ్ రవితేజ ఒకప్పుడు ఏ సినిమా తీసిన హిట్ అయ్యేది కానీ గత కొన్నేళ్ల నుంచి హిట్స్ కంటే ఫ్లాప్స్ నే ఎక్కువ చూస్తున్నాడు. స్టార్ స్టేటస్ ఉన్న హీరో కథలు ఇంకా కథలు ఎంచుకోవడంలో తప్పు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. అభిమానాన్ని అభిమానం లాగే చూడాలి .. మేము మీ అభిమానులం సార్ మనం ఒక సినిమా చేద్దాం అన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇలాగే ఉంటుందంటూ ఫ్యాన్స్ కూడా రవి తేజ మీద మండిపడుతున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీ తర్వాత అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఆచి తూచి అడుగులు వేసే రవి తేజ ఈ మధ్య ఎందుకు తడబడుతున్నాడు.. మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే కథ సరిగా వినకుండానే సినిమాలకు ఒకే చెప్పేస్తున్నారా .. లేక ఖాళీగా ఉండకుండా ఏదొక సినిమా చేద్దాం అని చేస్తున్నాడా అంటూ నెటిజెన్స్ కూడా మాస్ మహారాజ్ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా అంతే.. రవి తేజ ఇలాంటి సీన్లలో ఎలా నటించాడంటూ ప్రశ్నిస్తున్నారు. ముందు ముందు ఇదే సీన్ రిపీట్ అయితే ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లకుండా ఓటీటీలోనే రవి తేజ సినిమాలు చూసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఒకప్పటి రవితేజను మేము మళ్లీ చూడాలనుకుంటున్నాము.. ఇక నుంచైనా మంచి కథలు ఎంచుకోండి.. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది.. మీరు నవ్వాలి మమ్మల్ని నవ్వించాలి అంటూ ఆడియెన్స్ రవి తేజ కి ఈ విధంగా సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.