- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి కోరికలు ఎక్కువగా ఉండటంతో ముఖ్యమైన విషయాలు మర్చిపోతాం.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే ఇటీవల ఆమె పుట్టిన రోజు కావడంతో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పలు ప్రదేశాల్లో తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు ఊర్రూతలూగిస్తుంది. అయితే ఇదే ప్రదేశానికి విజయ్ దేవరకొండ కూడా వెళ్లినట్లు పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా, రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ అందరూ ప్రతి రోజు అదే మీ చివరి రోజు అని జీవించండి. నాకు తెలుసు నేను చెప్పేది మీకు బోరింగ్ అనిపిస్తుందని. కానీ ప్రతీ రోజు మన ఖర్చులు, బిల్లులు చెల్లింపుకు మనం సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాలి. ఇండస్ట్రీలో, సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి. కలలు, లక్ష్యాలను చేరుకోవాలి. అందుకే కష్టపడి పని చేయాలి. డెడ్ లైన్స్ ముందు అసైన్‌మెంట్స్ పూర్తి చేయాలి. కష్టించి చదవాలి మంచి కళాశాలలో సీటు పొందాలి. స్కాలర్‌షిప్‌లు అందుకోవాలి. మరెన్నో సాధించడానికి ప్రయత్నిస్తున్న మధ్యలో మనం చాలా ముఖ్యమైనది చేయడం మరచిపోతాం .. అందుకే నేను ఈ క్షణంలో జీవిస్తున్నాను.
క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలనే తాపత్రయం, డబ్బు బాగా సంపాదించాలి, సంపదతో ఉండాలనే కోరికతో మన ప్రయాణం సాగుతుంది. అలాగే జీవితంలో మంచి కారు, ఇల్లు, కొనుగోలు చేయాలి. ఇలాంటి కోరికలతో అందరి జీవితాలు సాగుతాయి. ఈ పోరాటంలో మనకు జీవితంలో ఏది ముఖ్యమైనే విషయం మర్చిపోతాం. మేము ప్రస్తుతం చాలా కష్టపడి పని చేస్తాము. మాకు కావలసినది పొందుతాము. మేము తరచుగా మన ఆనందాలను ద్వితీయంగా ఉంచుతాము అని ఆలోచిస్తూ ఉంటాము.. కానీ లక్ష్యాలు ఎప్పటికీ ఆగవని తెలుసు. మనం ఎల్లప్పుడూ మరింత కోరుకుంటూనే ఉంటాము... మనం మనుషులం. అయితే .. మన వర్తమానంలో జీవించడం కూడా సమానంగా ఉంటే.. అప్పుడు ఏమి జరుగుతుంది?’’ అని రాసుకొచ్చింది.