నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌కు ముందు శోభిత ధూళిపాళ ఎలా రెడీ అయిందో చూడండి.. (వీడియో)

by Kavitha |
నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌కు ముందు శోభిత ధూళిపాళ ఎలా రెడీ అయిందో చూడండి.. (వీడియో)
X

దిశ, సినిమా: రీసెంట్‌గా నాగచైతన్య ధూళిపాళ శోభిత ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేస్తూ X వేదికగా నూతన అక్కినేని కోడలుకు వెల్‌కమ్ చెప్పారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక అప్పటినుంచి సోషల్ మీడియా మొత్తం వీరిద్దరి పిక్స్‌తో షేక్ అయిపోతుంది. అయితే అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ వీరికి కంగ్రాట్స్ చెప్తుంటే.. సామ్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరిపై ఫైర్ అవుతూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా కొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శోభిత ధూళిపాళ.. చైతన్యతో ఎంగేజ్‌మెంట్ అయినప్పటినుంచి వారి ప్రైవేట్ ఫొటోలను షేర్ చేస్తూ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మేకప్ ఆర్టిస్ట్.. శోభిత నిశ్చితార్థానికి ముందు ఎలా రెడీ అయిందో దానికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ ‘అద్భుతమైన జంటకు జీవితకాలం ఆనందంగా అండ్ ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను’. అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి మీరు ఆ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

(video link credits to shraddhamishra8 instagram id)

Advertisement

Next Story