Ramya Krishna పెళ్లి కాకముందే ఆ వ్యక్తితో డేటింగ్‌లో ఉందా?

by Anjali |   ( Updated:2023-09-07 05:48:35.0  )
Ramya Krishna పెళ్లి కాకముందే ఆ వ్యక్తితో డేటింగ్‌లో ఉందా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ పవర్ ఫుల్ పాత్రలు చేసిన హీరోయిన్ ఎవరు? అంటే ముందుగా గుర్తొచ్చేది హీరోయిన్ రమ్మకృష్ణ. ఈ బ్యూటీ ఒక పాత్ర చేసిందంటే ఆ రోల్‌కే పవర్ వస్తుంది. ఇప్పటి వరకు ఈమె చేసినవన్నీ పవర్ ఫుల్ పాత్రలనే చెప్పుకోవచ్చు. అప్పట్లో నరసింహా చిత్రం నుంచి బహుబలి సినిమా వరకు రమ్యకృష్ణ నటించిన సినిమాలకు మంచి గుర్తింపు ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అలాగే విలన్‌గా.. హీరోయిన్‌గా.. ఐటెం సాంగ్స్.. తల్లి, అత్త పాత్రలు ఇలా ప్రతి ఒక్క పాత్రలో నటించి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కథానాయిక రమ్యకృష్ణ. అయితే అలాంటి ఈ హీరోయిన్ పెళ్లి కాకముందే ఓ పర్సన్‌తో సహజీవనం చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఆమె రిలేషన్‌లో ఉన్నది ఎవరో కాదు.. తన భర్త కృష్ణవంశీతోనే అట. కృష్ణవంశీ, రమ్యకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హీరోయిన్‌కు ఏజ్ మీద పడ్డ పెళ్లి చేసుకోకుండా సినిమాలు తీస్తూ వచ్చింది. ఆ సమయంలో కృష్ణవంశీతో డేటింగ్‌లో ఉందట. ఈ విషయం ఆమె తల్లిదండ్రుల చెవిన పడటంతో వేరే వ్యక్తితో వివాహం చేస్తామని ప్లాన్ చేయగానే.. వెంటనే తన ప్రియుడితో చెప్పి హడావిడిగా పెళ్లి చేసుకుందట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నెట్టింట చర్చానీయంగా మారింది..

Read More: Anasuya Bharadwaj: బ్లాక్ డ్రెస్‌లో అనసూయ పరువాల జాతర

Advertisement

Next Story